టీటీడీ పరకామణి చోరీ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

40చూసినవారు
టీటీడీ పరకామణి చోరీ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
టీటీడీ పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను సీబీసీఐడీకి అప్పగించి, డిసెంబర్‌ 2 నాటికి దర్యాప్తు పూర్తి చేయాలని సూచించింది. నిందితుడు రవికుమార్‌ ఆస్తులపై దర్యాప్తు జరపాలని ఏసీబీ డీజీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే, లోక్‌ అదాలత్‌లో రాజీ కుదిర్చిన న్యాయమూర్తి, మాజీ టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి, ఇతర అధికారుల పాత్రపై లోతుగా విచారణ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్‌ 2కి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్