నకిలీ ఆధార్‌తో టీటీడీ గదుల బుకింగ్.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

13724చూసినవారు
నకిలీ ఆధార్‌తో టీటీడీ గదుల బుకింగ్.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ వసతి గదులను అక్రమంగా పొంది, వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 12 నకిలీ ఆధార్ కార్డులు, 2 సెల్‌ఫోన్లు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ యాప్‌ల ద్వారా నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి, గదులు పొంది రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. అరెస్ట్ అయిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ఈ అక్రమ దందాను ఛేదించిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్