AP: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక తీర్మానం చేశారు. పరకామణిి చోరీ ఘటనపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. లోక్ అదాలత్‌లో రాజీ వెనుక కుట్రదారులను తేల్చేలా విచారణ జరపాలని తీర్మానం చేశారు. గతంలో నమోదైన కేసు పరిధి పరిమితంగా ఉండటంతో పాటు ఇటీవల కాలంలోనూ మరికొన్ని చోరీ ఘటనల దృష్ట్యా మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. తిరుమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తీర్మానించారు.