AP: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భక్తుల భద్రతను మెరుగుపరిచేందుకు టీటీడీ అధునాతన ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు భక్తుల రద్దీని అంచనా వేయడంతో పాటు, పాత నేరస్తుల కదలికలను గుర్తించి, అసాంఘిక శక్తుల దుశ్చర్యలను అడ్డుకోవడంలో సహాయపడతాయి. జనవరి నెలలో రథసప్తమి రోజున మాడవీధుల్లో వీటిని ఏర్పాటు చేయగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. దీని ద్వారా 24/7 పర్యవేక్షణతో భద్రతా చర్యలు చేపడుతున్నారు.