తుని చిన్నారి మిస్సింగ్... గోడపత్రికలను అతికిస్తున్న పోలీసులు

69చూసినవారు
తుని చిన్నారి మిస్సింగ్... గోడపత్రికలను అతికిస్తున్న పోలీసులు
AP: కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. చిన్నారి కనిపించకుండాపోయి 29 రోజులు గడిచినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో తుని రైల్వే స్టేషన్, బస్టాండ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆమె ఫోటోలతో కూడిన గోడపత్రికలను అతికిస్తున్నారు. జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. అటు చిన్నారి జాడ తెలియక తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్