పసుపు పాలు.. వీటినే గోల్డెన్ మిల్క్ అని కూడా అంటారు. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ కొందరు ఈ పాలు తీసుకోవడం హానికరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిత్తాశయ సమస్యలు, రక్తం పలుచబడే మందులు వాడేవారు, ఇనుము లోపం ఉన్నవారు, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వైద్యుడి సలహా మేరకు తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.