కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగిసిన అనంతరం ఏడుగురు అథ్లెట్లు అదృశ్యమైన ఘటన సంచలనం రేపింది. గ్లాస్గోలో పోటీలు ముగిసిన తర్వాత తమ జట్లతో కలిసి స్వదేశాలకు తిరిగి వెళ్లకుండా కొందరు కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తొలుత పాకిస్థాన్‌కు చెందిన బాక్సర్ ఖుద్రతుల్లా అదృశ్యమయ్యాడని సమాచారం రాగా, ఆ తర్వాత ఉగాండాకు చెందిన నలుగురు బాక్సర్లు కూడా కనిపించకుండా పోయారు. వీరిలో ఒకరు స్కాట్లాండ్‌లో ఆశ్రయం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.