యూపీలోని సహారన్‌పూర్ డెహ్రాడూన్ రోడ్డులో ఒక పెట్రోల్ పంప్ సమీపంలో కారు, రెండు ఆటోలు అత్యంత వేగంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాల్లో ప్రయాణిస్తున్న 7-8 మంది యువతులు ఒక్కసారిగా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఓ త్రీ-వీలర్ రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.