కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఏరువాక పౌర్ణమి వేడుకల సందర్భంగా, రైతు సురేశ్ తన ఎద్దులకు తుంగభద్ర నదిలో స్నానం చేయిస్తుండగా, రెండు ఎద్దులు నదిలో మునిగి మృతి చెందాయి. కుటుంబ సభ్యుల్లాంటి ఎద్దులను కోల్పోయిన రైతు, కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.