కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

6024చూసినవారు
కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి
హైదరాబాద్-వరంగల్ మార్గంలోని రఘునాథపల్లి వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి కాలువలో పడటంతో నయీమ్‌నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మహమ్మద్ అసద్, బిడిఎస్ డాక్టర్ అప్సా హబీబ్ మరణించారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కారులో ఉన్న మరో నలుగురు డ్రైవర్ రహముద్దీన్ ఖాన్, షాహిని బేగం, ఇలేషా, రేష్మ గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్