కంటైనర్‌ ఢీకొని..ఇద్దరు ఉద్యోగుల దుర్మరణం

8248చూసినవారు
కంటైనర్‌ ఢీకొని..ఇద్దరు ఉద్యోగుల దుర్మరణం
AP: సూళ్లూరుపేట పట్టణ పరిధిలో హోలీక్రాస్‌ వద్ద బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శ్రీసిటీలోని ప్రైవేటు కర్మాగారంలో పనిచేస్తున్న గోపిశెట్టి శ్రావణి (31), యాల్ల రాజశేఖర్‌ (32) రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా, చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కంటైనర్ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బ్రహ్మనాయుడు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్