AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు పలువురు నేతలను శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. హిందూపురంలో వైసీపీ నేతల పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దాంతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. అనంత వెంకటరామిరెడ్డి, పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.