కర్ణాటకలోని నెలమంగల తాలూకా కంబాలు గ్రామం వద్ద దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు ముగించుకుని తిరుగు ప్రయాణంలో మహీంద్రా థార్ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పవన్, దీపక్ అనే ఇద్దరు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తూ దొబ్బస్‌పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.