రైలు కింద పడి ఇద్దరి మృతి

7991చూసినవారు
రైలు కింద పడి ఇద్దరి మృతి
AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పరిధిలో విషాదం జరిగింది. జానపాడు వద్ద రైలు కింద పడి ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు పిడుగురాళ్ల గాంధీనగర్‌కు చెందిన షేక్ షరీఫ్, దాస్‌గా గుర్తించారు. స్నేహితులు మద్యం సేవించి ఘర్షణకు దిగారా? లేక ఎవరైనా హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్