AP: విశాఖ, విజయనగరం జిల్లాలలో శనివారం రెండు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జూన్ 24 నుంచి రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 61కి చేరింది. వీరిలో 29 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 28 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధిక యాక్టివ్ కేసులు విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయని ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.