విశాఖ నావికాదళ గూఢచర్యం కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మరో ఇద్దరికి ఆరేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేల చొప్పున జరిమానా విధించింది. మహారాష్ట్ర, యూపీకి చెందిన సంజయ్, సోనూ కుమార్ అనే దోషులకు ఈ శిక్ష పడింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు శిక్ష పడిన వారి సంఖ్య 10కి చేరింది. మిగతా ఐదుగురిపై విచారణ కొనసాగుతోంది.