ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు.. వివరణ

6633చూసినవారు
ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు.. వివరణ
AP: విశాఖ-దువ్వాడ మధ్య గురువారం ఉదయం రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. సంబంధిత మార్గంలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ అమర్చబడి ఉందని, దీని ప్రకారం రైళ్ల రాకపోకలు క్రమబద్ధంగా జరుగుతాయని వివరించింది. కొన్నిసార్లు రైళ్లు దగ్గరగా వెళ్లినట్లుగా కనిపిస్తుందని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

సంబంధిత పోస్ట్