AP: రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థినిపై ఇద్దరు యువకులు కారుతో దాడి చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో విద్యార్థిని తలపై నుంచి కారు వెళ్లడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడిన నామవరానికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.