ఇరాన్‌పై యుద్ధం త్వరలో ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) యుద్ధంలోకి ప్రవేశిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. అమెరికాతో కలిసి ఇరాన్‌పై యుద్ధం చేయనున్నట్లు UAE స్పష్టం చేసింది. గత నెల రోజులుగా పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ యుద్ధం మరో మలుపు తిరగనుంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో, హార్మూజ్ జలసంధిని ఇరాన్ చెర నుంచి విడిపించేందుకు అమెరికా, దాని మిత్రదేశాలకు సహాయపడేందుకు UAE ముందుకు వచ్చింది. ఈ మేరకు అరబ్ అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.