AP: అప్పుల బాధ తట్టుకోలేక చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖలో జరిగింది. అరిలోవ ప్రాంతానికి చెందిన జరజాపు వెంకట అజయ్ కుమార్ వ్యాపారం చేస్తుంటాడు. అప్పులు ఎక్కువ కావడంతో సింహాచలం సమీపంలోని లండగరువు తోటలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.