భార్య వేధింపులు తాళలేక భర్త ఆ
త్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలోని ఫరిదాబాద్‌లో చోటుచేసుకుంది. రాహుల్ (2
8) అనే వ్యాపారవేత్త రెండేళ్ల క్రితం జ్యోతి అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే తనని భార్య, అత్త వీణ, మామ బిట్టు, భార్య సోదరి నీతు నిత్యం వేధింపులకు గురి చేశారని సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియోలో చెప్పాడు. బయట బిజినెస్ చూసుకోవడం సహా ఇంట్లో పనులు చేసినా.. భార్య దారుణంగా కొట్టడంతో పాటు తప్పుడు కేసులు పెట్టిందని చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.