AP: విశాఖలో విషాదం చోటుచేసుకుంది. హెచ్‌బీ కాలనీలో డిగ్రీ విద్యార్థి సాయితేజ తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, పలు కోరణాల్లో స్థానికులను విచారిస్తున్నారు. కాగా, విద్యార్థి మృతితో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.