కేరళలోని పాలక్కాడ్‌లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నారాయణ
న్, అంధురాలైన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఇంటి అద్దె చెల్లించలేని స్థితిలో పోలీసులను ఆశ్రయించగా, వారు ప్రత్యామ్నాయ వసతి కల్పించారు. అయితే, జూన్ 25న పిరవం సమీపంలోని నదిలో పిల్లలతో కలిసి తల్లి, తండ్రి దూకి ఆత్మహత్య
చేసుకున్నారు. శుక్రవారం తల్లి, రెండేళ్ల కుమారుడి మృతదేహాలు, శనివారం తండ్రి మృతదేహం, ఆదివారం ఏడేళ్ల బాలిక మృతదేహం వెలికితీశారు. జూన్ 28న కొత్త నివాసానికి మారాల్సి ఉండగా ఇంతలో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.