అండర్-19 వరల్డ్ కప్‌లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ మధ్య కీలకమైన 'సూపర్ సిక్స్' గ్రూప్-2 మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్ బెర్త్ కోసం ఈ పోరు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు టోర్నీలో అజేయంగా దూసుకుపోతున్న ఆయుష్ మాత్రే సారథ్యంలోని టీమిండియా, ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ తమ విజయ పరంపరను కొనసాగించాలని భారత యువ జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.