అండర్-19 ప్రపంచకప్.. పాక్ కోచ్ వివాదాస్పద చర్య

3413చూసినవారు
అండర్-19 ప్రపంచకప్.. పాక్ కోచ్ వివాదాస్పద చర్య
ఫిబ్రవరి 1న అండర్-19 ప్రపంచకప్-2026లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన కీలకమైన సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో భారత్ 252 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తరపున వేదాంత్ త్రివేది 68 పరుగులు చేయగా, కనిష్క్‌ చౌహాన్‌ 35, ఖిలన్‌ పటేల్ 21 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ సందర్భంగా, పాకిస్తాన్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగించడం వివాదాస్పదమైంది. ఐసీసీ నిబంధనల ప్రకారం, PMOAలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం ఉంది.

సంబంధిత పోస్ట్