అండర్-19 ప్రపంచకప్.. టోర్నీ నుంచి పాక్ వికెట్ కీపర్ ఔట్

2134చూసినవారు
అండర్-19 ప్రపంచకప్.. టోర్నీ నుంచి పాక్ వికెట్ కీపర్ ఔట్
ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026లో ఆదివారం భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ షాయన్ ప్రాక్టీస్ సెషన్‌లో ముక్కుకు గాయమై, టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. నెట్స్‌లో కీపింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, బంతి ముక్కుకు తగలడంతో ఎముక ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పాక్ శిబిరంలో ఆందోళన నెలకొంది. షాయన్ స్థానంలో హంజా జహూర్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ సూపర్ సిక్స్ దశకు చేరుకుంది. భారత్‌పై గెలిస్తే సెమీఫైనల్ అవకాశాలు మెరుగుపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్