తక్షశిలకు మరమ్మతులు చేపట్టిన పాక్.. యునెస్కో తీవ్ర ఆగ్రహం

378చూసినవారు
తక్షశిలకు మరమ్మతులు చేపట్టిన పాక్.. యునెస్కో తీవ్ర ఆగ్రహం
పాకిస్థాన్‌లోని తక్షశిల పురాతన పురావస్తు క్షేత్రంలో జరుగుతున్న సంరక్షణ పనులపై యునెస్కో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు నిర్మాణాల ప్రామాణికత, చారిత్రక విలువను దెబ్బతీసేలా పనులు జరుగుతున్నాయని హెచ్చరించింది. పనులను వెంటనే నిలిపివేయకపోతే తక్షశిలను 'వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్' జాబితాలో చేర్చడంతో పాటు, ప్రపంచ వారసత్వ హోదానూ రద్దు చేస్తామని హెచ్చరించింది. యునెస్కో నిబంధనలకు విరుద్ధంగా సిమెంట్‌తో గోడలు నిర్మించడం, పురాతన గోడల స్థానంలో కొత్త రాతి నిర్మాణాలు చేపట్టడం వంటి చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్