ఎక్సైజ్ శాఖకు ఊహించని షాక్.. లిక్కర్ షాపులు మూసి వేత

8316చూసినవారు
ఎక్సైజ్ శాఖకు ఊహించని షాక్.. లిక్కర్ షాపులు మూసి వేత
AP: అనకాపల్లి జిల్లాలో ఎక్సైజ్ శాఖకు ఊహించని షాక్ తగిలింది. లైసెన్స్ ఫీజులు పెరగడం, పర్మిట్ రూమ్‌ల కోసం ఒత్తిళ్లు పెరగడంతో వ్యాపారులు లిక్కర్ షాపులు మూసివేశారు. స్టాక్‌ అక్కడే వదిలి, షాపుల తాళాలను ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. అధికారులు సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. నెలాఖరు వరకు వేచి చూస్తామని, పరిష్కారం రాకపోతే శాశ్వతంగా మూసేస్తామని వ్యాపారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్