ప్రధాని నరేంద్ర
మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో రూ.14,115 కోట్ల విలువైన రోడ్డు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ముఖ్యంగా ఢిల్లీలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించి, ఉత్తరప్రదేశ్‌తో కనెక్టివిటీని పెంచేందుకు ద్వారకా టన్నెల్ ప్రాజెక్టుకు రూ.6,970 కోట్లు కేటాయించారు. ఈ ఆరు లేన్ల అండర్‌గ్రౌండ్ టన్నెల్ 8.1 కిలోమీటర్ల మేర విస్తరించి, శివమూర్తి ఇంటర్‌ఛేంజ్ నుంచి DND ఫ్లైవే వరకు అనుసంధానం అవుతుంది. దీనివల్ల వెస్ట్ ఢిల్లీ, గురుగ్రామ్ నుంచి సౌత్, ఈస్ట్ ఢిల్లీకి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.