AP: నేడు విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె జీఎస్టీ సంస్కరణలపై అవగాహన సదస్సులో పాల్గొననున్నారు. అదేవిధంగా ‘స్వస్థ్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో కూడా పాల్గొని మహిళా సాధికారత, కుటుంబ ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించనున్నారు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ రాష్ట్ర, కేంద్ర అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.