AP: విజయనగరం జిల్లా భోగాపురంలో పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్, మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. విద్యార్థుల ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని కేంద్రమంత్రి ప్రధాన్ అభినందించారు. పాఠశాల విద్యా ప్రమాణాలు, బోధనా విధానాలు, మౌలిక సదుపాయాలను ప్రశంసిస్తూ, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.