కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌లతో కలిసి ఆయన భోగాపురంలోని ‘పీఎం శ్రీ’ మోడల్ స్కూల్‌ను సందర్శించారు. అక్కడ ఆధునిక విద్యా బోధన, డిజిటల్ తరగతులు, మౌలిక వసతులను పరిశీలించి,
విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.