విశాఖలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ పర్యటన

7చూసినవారు
విశాఖలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ పర్యటన
AP: విశాఖపట్నంలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ మెడ్‌టెక్ జోన్‌ను సందర్శించి, సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం అచ్యుతాపురంలోని బ్రాండిక్స్‌ పరిశ్రమలో ఉత్పత్తి ప్రక్రియలను పరిశీలించి, కార్మికులతో మాట్లాడారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్నది టెక్స్‌టైల్ రంగమేనని ఆయన పేర్కొన్నారు. టెక్నికల్ టెక్స్‌టైల్స్ అభివృద్ధి కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును కోరినట్లు తెలిపారు. మహిళా సాధికారతే ప్రధాని మోదీ లక్ష్యమని గిరిరాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్