రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు భేటీ

46చూసినవారు
రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు భేటీ
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం, శ్రీకాకుళం జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతంపై మాట్లాడారు. అలాగే  శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్, తిరుపతికి డైరెక్ట్ రైళ్ల ప్రారంభం, ధోలేరా అంతర్జాతీయ విమానాశ్రయం పురోగతి, మందస రోడ్, పాతపట్నం, హరిశ్చంద్రపురం స్టేషన్లలో రైళ్ల నిలుపుదల, కామేశ్వరీపేట హాల్ట్ స్టేషన్ అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్