కేంద్ర మంత్రి రామ్మోహన్ శ్రీకాకుళంలోని తన స్వగృహంలో శ్రీ అయ్యప్పస్వామివారి మహాపడి పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తన సతీమణితో కలిసి ఈ పూజలో పాల్గొన్న మంత్రి, ప్రజలందరికీ శ్రేయస్సు, సుఖసంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.