AP: కౌలు రైతులకు (పంట సాగుదారు హక్కు పత్రం) యూనిక్ ఐడీ నంబర్ జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం వల్ల భూములున్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రాయితీలు, ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు భూములున్న రైతులకు మాత్రమే కేంద్రం విశిష్ట గుర్తింపు సంఖ్యను అందిస్తోంది. సీఎం చంద్రబాబు సూచనల మేరకు కౌలు రైతులకు కూడా ఈ నంబర్ జారీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సాంకేతికంగా పరీక్షించిన తర్వాత దీనిని అమలు చేయనుంది.