అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలి: సీపీఐ

9389చూసినవారు
అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలి: సీపీఐ
AP: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ధర్నా, ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శనివారం సీపీఐ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను అడ్డుకుని, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం సరికాదని సీపీఐ నాయకులు అన్నారు. వెంటనే అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్