అప్పటివరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత: భారత్‌ క్లారిటీ

13366చూసినవారు
అప్పటివరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత: భారత్‌ క్లారిటీ
సింధూ జలాల ఒప్పందంపై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత్ స్పష్టం చేసింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు పూర్తిగా నిలిపివేసే వరకు ఒప్పందం అమలును పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాన్ని పాకిస్థాన్ విరమించుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధూ జలాల ఒప్పందంలో ఏకపక్షంగా వ్యవహరించడం సాధ్యం కాదని, దీనిపై పాకిస్థాన్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్