AP: తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల కోసం రాష్ట్రంలోని సుమారు 3 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. తొలి విడతలో జులై 22న 64.76 లక్షల మంది విద్యార్థులకు నిధులు జమయ్యాయి. కొత్తగా 1వ తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరినవారు, సాంకేతిక కారణాలతో తొలి విడతలో ప్రయోజనం పొందనివారికి రెండో విడతలో సాయం అందించనున్నారు. ఆగస్టు 30న విడుదల కావాల్సిన నిధులు ఆలస్యమయ్యాయి. దీంతో అక్టోబర్ తొలి లేదా రెండో వారంలో జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం విద్యార్థి, తల్లి ఆధార్, ఈ-కేవైసీ, బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ, ఆధార్ లింకింగ్, పాఠశాల లేదా కళాశాల వివరాలను సరిచూసుకోవాలి.