మార్చిలో రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు

6672చూసినవారు
మార్చిలో రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు
పండుగలు, ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో యూపీఐ ద్వారా లావాదేవీలు మార్చిలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఎన్‌పీసీఐ గణాంకాల ప్రకారం రూ.29.53 లక్షల కోట్ల విలువైన 2,264 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఇది గత ఏడాది మార్చిలో నమోదైన రూ. 24.77 లక్షల కోట్లతో పోలిస్తే విలువపరంగా 19 శాతం అధికం. డిజిటల్ చెల్లింపులు ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయని పేనియర్‌బై ఎండీ ఆనంద్‌ కుమార్‌ బజాజ్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్