రికార్డులు సృష్టించిన యూపీఐ లావాదేవీలు

4726చూసినవారు
రికార్డులు సృష్టించిన యూపీఐ లావాదేవీలు
దేశంలో డిజిటల్ చెల్లింపులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు యూపీఐ ద్వారా రూ. 230 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ రాజ్యసభలో తెలిపారు. ఇది గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన రూ. 139 లక్షల కోట్ల లావాదేవీల కంటే చాలా ఎక్కు అని పేర్కొన్నారు. అలాగే యూపీఐ ఇప్పుడు ఎనిమిది దేశాలలోనూ విస్తరిస్తోందని, అంతర్జాతీయ విస్తరణ కోసం ప్రభుత్వం, ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ చర్యలు తీసుకుంటున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్