రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. వేల్పూర్ మండలం అంక్సాపూర్‌లో జాతీయ రహదారిపై బైఠాయించి, పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని కోరారు. డిచ్‌పల్లిలో చెప్పులు వరుసలో పెట్టి నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోనూ రైతులు రాస్తారోకో చేశారు. యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ ఎరువుల దుకాణాలు తెరవకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.