ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా రాజ్యసభలో ఆహార కల్తీపై తీవ్రంగా మండిపడ్డారు. పాలు, సుగంధ ద్రవ్యాలు, వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, పానీయాల్లో హానికరమైన రసాయనాలు, అధిక స్థాయిలో సంతృప్త కొవ్వులు, చక్కెర లేదా ఉప్పు వంటివి ఉన్నాయని, ఇవి అనారోగ్య కారకాలని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. మార్కెట్లోకి విషాన్ని అమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశోధనల ప్రకారం, పాల నమూనాలలో 71% యూరియా, 64% సోడియం బైకార్బోనేట్ వంటి న్యూట్రలైజర్లు ఉన్నాయని, పరీక్షించిన ప్రతి నాలుగు ఆహార నమూనాలలో ఒకటి కల్తీ అయినట్లు తేలిందని ఆయన తెలిపారు.