AP: రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఆగస్టులో 1,65,000 టన్నుల యూరియా రావాల్సి ఉండగా.. ఇప్పటివరకూ 65 వేల టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. ఇంకా లక్ష టన్నుల యూరియా రావాల్సి ఉంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడంతో పంటల సాగు ఎక్కువగా జరిగింది. దాంతో యూరియా డిమాండ్ పెరిగిపోయింది. కోటా ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన మొత్తం యూరియాను ఈ నెలలోనే పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.