అమెరికా కాంగ్రెస్ నివేదిక పాకిస్థాన్‌ను 'ఉగ్రవాదానికి కేంద్రబిందువు'గా అధికారికంగా పేర్కొంది. పాకిస్థాన్ డజనుకు పైగా ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోందని ఈ నివేదిక వెల్లడించింది. ఈ సంస్థలు ప్రపంచాన్ని, ఆఫ్ఘనిస్థాన్‌ను, భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. పాక్ సైన్యం, నిఘా సంస్థలు ఉగ్రవాదంపై పోరాడుతున్నట్లు నటిస్తూనే కొన్ని సంస్థలకు అండదండలు అందిస్తున్నాయని విమర్శలున్నాయి. భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న సంస్థలకు పాక్ ప్రభుత్వం, సైన్యం నుంచి నైతిక, ఆర్థిక, ఆయుధ సహకారం అందుతోందని సమాచారం.