చైనా బిలియ‌నీర్‌కు 30 ఏళ్ల జైలుశిక్ష విధించిన అమెరికా కోర్టు

1383చూసినవారు
చైనా బిలియ‌నీర్‌కు 30 ఏళ్ల జైలుశిక్ష విధించిన అమెరికా కోర్టు
ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నానని చెబుతూ చైనీయుల మద్దతు పొందిన బిలియనీర్ గువో వెంగుయికి అమెరికా కోర్టు 30 ఏళ్ల జైలుశిక్ష విధించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ అవినీతిని ఎండగడతానంటూ భారీ ఆన్‌లైన్ ఉద్యమాన్ని నడిపిన గువో, తన ఫాలోవర్ల నుంచి సుమారు బిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు కోర్టు తేల్చింది. ఇన్వెస్ట్‌మెంట్, క్రిప్టో స్కీమ్‌ల పేరుతో సేకరించిన ఈ నిధులతో అమెరికాలో విలాసవంతమైన భవంతి, లాంబోర్గిని, యాచ్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.

సంబంధిత పోస్ట్