ఆంత్రోపిక్ సంస్థకు చెందిన శక్తివంతమైన ఏఐ మోడళ్లు ‘క్లాడ్ ఫేబుల్ 5’, ‘మైథోస్ 5’లపై
అమెరికా విధించిన విదేశీ యాక్సెస్ ఆంక్షలను ఎత్తివేసింది.
అమెరికా వాణిజ్య శాఖ నియంత్రణలను తొలగించడంతో ఈ మోడళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆంత్రోపిక్ ప్రకటించింది. భద్రతా ప్రమాదాలను పరిష్కరించడానికి, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆంత్రోపిక్ అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఈ మోడళ్లను విదేశీ పౌరులు యాక్సెస్ చేయకుండా నిరోధించింది.