అమెరికా సైన్యం పరీక్షలు.. కుప్పకూలిన ప్రయాణికుల విమానం

8108చూసినవారు
అమెరికా సైన్యం పరీక్షలు.. కుప్పకూలిన ప్రయాణికుల విమానం
అమెరికాలోని వైట్‌శాండ్స్ మిసైల్ రేంజ్‌లో మే 13న నిర్వహించిన జీపీఎస్ జామింగ్ పరీక్షల సమయంలో ప్రయాణిస్తున్న ట్విన్ ఇంజిన్ విమానానికి కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తినట్లు అమెరికా మీడియా సంచలన కథనం వెల్లడించింది. ఈ అంతరాయాల కారణంగా విమానం రన్‌వేను సరిగా చేరుకోలేక ముందుగానే కుప్పకూలినట్లు పేర్కొంది. ఘటనకు సైనిక పరీక్షల ప్రభావం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా దీనిపై తుది నిర్ధారణ వెలువడాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్