అమెరికా ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంథ్రోపిక్ సంస్థ తన క్లాడ్‌లో మైథోస్–5, ఫేబుల్–5 మోడళ్లను ఇతర దేశాల్లో వాడకుండా నిషేధించింది. అత్యాధునిక ఏఐ మోడళ్లను స్వదేశంలోనే ఉంచుకోవడం ద్వారా ఏఐపై గుత్తాధిపత్యం సాధించాలనేది
అమెరికా వ్యూహంగా నిపుణులు భావిస్తున్నారు. ఈ నిషేధం వల్ల భారతదేశంలోని స్టార్టప్‌లకు, సైబర్‌సెక్యూరిటీ సంస్థలకు ఆధునిక టూల్స్ అందుబాటులో ఉండవు. దీంతో భారత్ సొంత ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసుకోవాలని టెక్నోక్రాట్ మోహన్‌దాస్ పాయ్ ప్రధాని మోదీని అభ్యర్థించారు. కాగా, ఆంథ్రోపిక్ సంస్థ భద్రతా కారణాలను చూపుతూ
అమెరికా విధించిన ఆంక్షలపై అసహనం వ్యక్తం చేసింది.