ఆధునిక సాంకేతికతలో భాగంగా కృత్రిమ మేధ (ఏఐ) న్యాయ ప్రక్రియలోనూ వినియోగంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎసెల్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ కేసులో ఏఐ టూల్స్ ద్వారా సృష్టించబడిన నకిలీ తీర్పులను పరిగణనలోకి తీసుకోవడంపై సుప్రీం కోర్టు స్పందించి, ఈ తీర్పును పక్కనబెట్టింది. న్యాయ ప్రక్రియలో ఏఐ వినియోగం ప్రమాదకరమని సుప్రీం కోర్టు హెచ్చరించింది.